హనుమకొండలోని బంధన్ హాస్పిటల్ లో జర్నలిస్టు కృష్ణకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు తక్షణమే విచారణ జరిపి సర్జన్ నళిన్ కృష్ణ , హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జనరల్ సెక్రెటరీ తరాల సందీప్ బుధవారం డిమాండ్ చేశారు. బంధన్ హాస్పిటల్ వైద్యుడు సర్జన్ నళిన్ కృష్ణ నిర్వాకం వల్లే జర్నలిస్టు కృష్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్లి మంచానికి పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.