హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల గ్రామానికి చెందిన శాంతాల మల్లేశం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే 2023 సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్ మేట్స్ తన కుటుంబం పట్ల విచారణ వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఆర్థికంగా ముందుకు వచ్చి మంగళవారం 30 వేల రూపాయలు సహాయం చేసి కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.