వెహికిల్ షెడ్ నిర్వహణపై ఆగ్రహం

75చూసినవారు
వెహికిల్ షెడ్ నిర్వహణపై ఆగ్రహం
హనుమకొండ లోని వెహికిల్ షెడ్డు నిర్వహణపై మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు వెహికల్ షెడ్డును పరిశీలించారు. పదుల సంఖ్యలో మరమ్మతుల కోసం నిలిచిన వాహనాలు, బురదమయంగా మారిన ఆవరణ చూసి అసహనం వ్యక్తం చేశారు. చిన్న వాహనాల ద్వారా సేకరించిన చెత్తను షెడ్ నుంచి భారీ వాహనాలకు తరలించే క్రమంలో బాలసముద్రం పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్