బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తగు సూచనలు చేశారు. ఈనెల 30న కౌన్సిల్ సమావేశం జరుగుతుందని, ఇందుకోసం వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు.