మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ నగరానికి బుధవారం వస్తున్నారు. హైదరాబాద్ లో ప్రపంచ సుందరి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని చారిత్రక, వారసత్వ, పర్యాటక ప్రదేశాల సందర్శనకు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రానున్నారు. ప్రముఖ దేవాలయమైన వేయి స్తంభాల గుడి, ఫోర్ట్ వరంగల్ ను సందర్శించడం జరుగుతుంది. అందుకోసం కోటను ముస్తాబు చేశారు.