ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి

68చూసినవారు
వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం ఎల్కతుర్తి లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్య సేవల నిమిత్తం రోజు ఎంతమంది వస్తుంటారనే వివరాలను, ఫార్మసీలో మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్