వరంగల్ తూర్పు నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో వరంగల్ తాహసీల్దార్ కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, డబుక్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు, బిసి బంధు, నిరుద్యోగ భృతి వంటి హామీలను అర్హులైన వారందరికీ ఇవ్వనందుకు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, నాయకులు వన్నాల వెంకటరమణ, గంటా రవికుమార్, కనకుంట్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.