వరంగల్ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం చక్రతీర్ధోత్సవం (చక్రస్నానం), ధ్వజ అవరోహణం, ఘటాభిషేకం పుష్పయాగంతో సుసంపన్నమయ్యాయి. అమ్మవారికి నిత్యాహ్నికం పూర్తిచేసిన తర్వాత స్నవనవిధి విశేష పూజాదికములు నిర్వహించి అమ్మవారికి చూర్ణోత్సవం జరిపారు. సువాసినీమణులు (ముత్తయిదువలు) అందరూ కలసి జరిపిన చూర్ణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.