ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్, సిఎం తోపాటు, డిప్యూటీ సిఎం, భట్టి మంత్రులు పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు, లబ్దిదారుల జాబితాల తయారీ పై చర్చించారు. జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు.