బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

82చూసినవారు
విద్యార్థినులు చదువుల్లో అత్యుత్తమ ప్రతిభను చాటాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం రాత్రి హనుమకొండ రెడ్డికాలనీలోని తెలంగాణ ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. కళాశాల వసతి గృహం వద్ద ఆర్టీసీ బస్సులు ఆగే విధంగా చూడాలని విద్యార్థినులు కోరారు. అనంతరం కళాశాల విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్