హనుమకొండ ఎలకతుర్తి మండలం సూరారం గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భాగ్యలక్ష్మి, సరస్వతి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన స్థలాన్ని మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ స్థలం యొక్క స్వభావాన్ని, గ్రూపుల ఆర్థిక పరిస్థితిని గ్రూప్ లీడర్లను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీను, డీఎం మహేశ్వర్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్ పాల్గొన్నారు.