దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక శాఖ వారోత్సవాల పోస్టర్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు.