వరంగల్ కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ పనులతో పాటు స్విమ్మింగ్ ఫూల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కౌన్సిల్ హాల్ లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులతో పాటు ఇండోర్ స్టేడియం సమీపంలో నిర్మితమవుతున్న స్విమ్మింగ్ ఫూల్ పనులను కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే తో కలిసి మేయర్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.