వరంగల్ నాలాల పూడికతీత వేగవంతంగా పూర్తి చేయండి

52చూసినవారు
వరంగల్ నాలాల పూడికతీత వేగవంతంగా పూర్తి చేయండి
నాలాల పూడికతీతలో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా పరిధిలోని బొందివాగు, మ్యూజికల్ గార్డెన్స్ వద్ద భద్రకాళి నాలాలో కొనసాగుతున్న పూడికతీత ప్రక్రియను మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ నగరం ముంపు నివారణలో భాగంగా నగరంలోని భద్రకాళి, బొందివాగు, నయింనగర్, దర్గా కాజిపేట, శాకరాశికుంట నాళాలు పూడికతీయాలన్నారు.

సంబంధిత పోస్ట్