హనుమకొండ జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 27 లోగా యువ టూరిజం క్లబ్ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. హనుమకొండ జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. టూరిజం అధికారి శివాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని, వంగర టూరిజం ప్రాజెక్టు పనులు పూర్తి చెయాలని సూచించారు.