ఈనెల 12వ తేదీన హనుమకొండ న్యూ శాయంపేట హంటర్ రోడ్డు దోనగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హాజరవుతున్నట్లు శనివారం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.