వరంగల్ మామూనూర్ పోలీస్ డివిజనల్ కార్యాలయమును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. lశనివారం మధ్యాహ్నం మామూనూర్ ఏసీపీ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ తిరుపతి మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ డివిజనల్ కార్యాలయమునకు సంబంధించిన రికార్డులను, కేసుల దర్యాప్తు స్థితి గతులపై పోలీస్ కమిషనర్ ఏసిపిని అడిగి తెలుసుకున్నారు.