ఆదిగురువు అత్రి మహర్షి, అనసూయ మాతల పుత్రుడు గురువులకే గురువు అవధూత నడయాడే దత్తాత్రేయ స్వామీ జయంతి వేడుకలు ఈ నెల 15 వ తేది ఆదివారం వరంగల్ దత్తక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు శ్రీ గణపతి సచ్చిదానంద దత్తజ్ఞాన బోధ సభ ట్రస్ట్ సభ్యులు వామన్ రావు శుక్రవారం తెలిపారు. మార్గశిర మాసం పౌర్ణమి రోజున దత్తస్వామి జయంతిని పురస్కరించుకొని శ్రీ వరద దత్తాత్రేయ స్వామి వారి పూజలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.