కలకత్తాలో వైద్య విద్యార్థినిని అత్యాచారం, హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని శనివారం వరంగల్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. కలకత్తా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని, వైద్యులకు రక్షణ కల్పించలేని కలకత్తా ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలన్నారు.