పారిశుధ్య కార్మికులకు ఒంటి పూట విధులు: బల్దియా కమిషనర్

569చూసినవారు
పారిశుధ్య కార్మికులకు ఒంటి పూట విధులు: బల్దియా కమిషనర్
వరంగల్ బల్దియాలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి రేపటి (గురువారం) నుండి ఒక్క పూట విధులు నిర్వహిస్తారని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు (ఒక పూట మాత్రమే) విధులు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్