బైరాన్ పల్లిలో పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం హసన్ పర్తి సీఐ చేరాలు తెలిపారు. బైరాన్పల్లికి చెందిన సంగనబోయిన రాజయ్య కొంతకాలంగా షుగర్, బీపీతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలోనే కాలివేలు తొలగించగా ఇన్ఫెక్షన్ కావడంతో నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎంజీఎంకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.