హనుమకొండ: ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జంక్షన్ సుందరీకరణ పనులను కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్ స్తంభాలను వేరే చోటకు త్వరగా మార్చాలని, సుందరీకరణ పనుల్లో భాగంగా చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.