లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

50చూసినవారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
హన్మకొండ సుబేదారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జులై 11న వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని గురుకుల్ ది స్కూల్ లో బుధవారం వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, జనాభా పెరుగుదల పర్యవసానాలు, పర్యావరణ సమతుల్యత కాపాడాల్సిన అవసరాలు, భూమిని పరిరక్షించడానికి చెయ్యవలసిన తక్షణ కర్తవ్యాలు తదితర అంశాలపై చిన్నారులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్