అపరిశుభ్ర పరిస్థితుల్లో, ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటల్స్ నిర్వహణకు గాను మొత్తం రూ. 62 వేలు జరిమానా విధించినట్లు శుక్రవారం బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజారెడ్డి తెలిపారు. నగర పరిధి లోని పలు హోటళ్లు, రెస్టారెంట్ లు షాపులను శానిటేషన్ అధికారులు తనిఖీలు చేపట్టి అపరిశుభ్ర పరిస్థితుల్లో ఎక్సైజ్ కాలనీ లో గల నాటుకోడి చిట్టి గారెలు హోటల్ కు రూ. 30 వేలు, కడాయి రెస్టారెంట్‌కు రూ. 30 వేల జరిమానా విధించారు.