హనుమకొండ నగరంలోని సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. ఈ వేడుకలలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు, పాల్గొన్నారు.