ఏలాంటి అనుమతులు లేకుండా నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న హనుమకొండ గుడిబండల్ ప్రాంతానికి చెందిన బింగి రమేష్ అనే వ్యక్తిని శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని నుండి రూ. 1, 67, 400 విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కొరకు నిందితుని హనుమకొండ పోలీసులకు అప్పగించారు.