హన్మకొండ పద్మాక్షి రోడులో గల హనుమత్గిరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు ఉదయం స్వామివారికి బ్రహ్మోత్సవాలలో గణపతి పూజ నవగ్రహ మాన్య సూక్తా హవనము అలంకరణ అర్చనలు నిర్వహించి 250 కేజీల లడ్డు ప్రసాదము నివేదించిడం జరిగిందని దేవాలయ అర్చకులు ఆరుట్ల రామాచార్యులు భాస్కర చార్యులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు భజన కార్యక్రమం అనంతరం ఐదు వందల భక్తులకు అన్న ప్రసాదము షైన్ స్కూల్ అధినేత మునగాల కుమారస్వామి దంపతులు అన్న ప్రసాదం బిక్ష ఏర్పాటు చేయడం జరిగింది.