భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సోమవారం హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ లో మాజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. పిల్లి సాంబ శివరావు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా డా. సాంబశివరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించలని అన్నారు. బీసీ సంఘం నాయకులు అల్లాడి శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.