ప్రతి మౌలిక సమస్యకు సమాధానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని, ప్రజల జీవన ప్రమాణం మెరుగుపరచడమే తమ లక్ష్యమని ౬ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పోతననగర్ లో వరద నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ. 75 లక్షలతో బాక్స్ కల్వర్ట్ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. గత పదేళ్లలో ఎప్పుడూ జరగని విధంగా వరంగల్ లో అభివృద్ధి జరుగుతుందన్నారు.