

టెక్సాస్‌లో చిన్నారులు మృతి.. మోదీ సంతాపం (వీడియో)
అమెరికాలోని టెక్సాస్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వరదల బీభత్సానికి అక్కడ 24 మందికిపైగా మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "టెక్సాస్‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం, ముఖ్యంగా పిల్లలు మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. అమెరికా ప్రభుత్వానికి మరియు మృతుల కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాము." అని ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.