హనుమకొండ జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి వి. బి. నిర్మల గీతాంబ అన్నారు. జిల్లాలో మొత్తం 10 బెంచీలను ఏర్పాటు చేసి 7086 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 8 బెంచీలను ఏర్పాటు చేసి 13145 కేసులు పరిష్కరించినట్టు ప్రధాన న్యాయమూర్తి కే. పట్టాభిరామ రావు తెలిపారు.