ఐనవోలు మండలం పున్నేల్ గ్రామంలో శాంతాల సునీత భర్త మల్లేష్ అనారోగ్యంతో మరణించగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశం మేరకు రాయపురం సాంబయ్య, స్థానిక కార్యకర్తలు మంగళవారం వెళ్లి పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యంతో అన్నం పెట్టి వారిని ఆదరించారు. గత ప్రభుత్వం దొడ్డిబియ్యం ఇస్తే అమ్ముకునే వాళ్ళం నా భర్త మల్లేష్ మరణించగా ఇంట్లో ఒక రూపాయి లేదని రేవంతన్న ఇచ్చిన సన్న బియ్యం తో మా కడుపు నింపుకుంటున్నామన్నారు.