కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ అదాలత్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి, పండ్లు, స్వీట్స్ లను పంపిణీ చేసి సంబురాలు చేశారు. శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ అని కొనియాడారు. వారితో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.