రాజ్యంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో శనివారం కాజీపేట మండల పరిధిలోని మడికొండ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ, డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగం చిత్రపటాలను చేతిలో పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం గురించి వివరించి వాటి విలువలను తెలియజేసారు.