బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. పట్టాభిరామరావు అన్నారు. గురువారం ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషత్ హల్ లో న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. బాల కార్మికులు, తప్పిపోయిన వారు, అనాథ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే అవగాహన కలిపిస్తూ అనేక విభాగాలు పని చేస్తున్నాయని తెలిపారు.