వరంగల్ నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో కరీమాబాద్ ఉర్సు బొడ్రాయి ప్రాంతంలో ఓ కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనతో చెట్టులో మంటలు చెలరేగగా, స్థానికులు వాటిని ఆర్పేందుకు యత్నించారు. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా, వాటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.