తెలంగాణ అంబేద్కర్ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో శంభునిపేట జంక్షన్ లో బుధవారం కరపత్రాలు ఆవిష్కరించారు. ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు బుల్లెట్ వెంకన్న మాట్లాడుతూ, ప్రజా యుద్ధనౌక గద్దర్, ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని చుండూరు అమరవీరుల 33వ వర్ధంతి సంస్మరణ సభను ఆగస్టు 6న వరంగల్లో జరిగే సభకు అందరూ హాజరవ్వాలన్నారు.