గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ విధులకు కేటాయించిన అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్ -2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రూప్ -2 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల హాల్ టికెట్, ఫోటో గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.