వరంగల్ ఎంజిఎం హాస్పటల్లో మంగళవారం సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ సెంటర్ ను వరంగల్ ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లేట్ లెట్స్ ను సేకరించే విధానాన్ని మంత్రులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్డిపి సెంటర్ తో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు గొప్ప ఊరట లభిస్తుందని మంత్రులన్నారు.