హనుమకొండ సుబేదారిలోని పాత కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, కమిషనర్ అశ్విని శుక్రవారం పరిశీలించారు. చుట్టూ ఉన్న పరిసరాలను ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. పాత కలెక్టర్ క్యాంప్ కార్యాలయ భవనాన్ని మరమ్మతు పనులు చేయించి అందుబాటులోకి తీసుకురావడానికి గల అవకాశాల గురించి అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.