ప్రజల సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ప్రజా సమస్యల నిర్ములనే ధ్యేయంగా పనిచేస్తున్నానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వడ్డేపల్లిలో రూ 1. 20కోట్లతో నిర్మించిన హిందూ స్మశాన వాటికను ప్రారంభించారు. చాలా ఏళ్లుగా స్థానిక ప్రజలు అవస్తలు పడుతున్న తరుణంలో నిర్ణత సమయంలో పూర్తి చేసిన సందర్బంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు