హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అనంతరం ఎమ్మెల్యే నాయినిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్టియన్ సోదర, సోదరిమనులకు ఎమ్మెల్యే సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ఉన్న క్రైస్తవ ఆలయాల పరిరక్షణ, ఖాబ్జాలు కాకుండా చూస్తానని తెలిపారు.