జిల్లాలో అమల్లోకి నూతన భూభారతి చట్టం: కలెక్టర్

57చూసినవారు
ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టం లో కల్పించిన హక్కులు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్దీకరణ, తదితరాంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్