ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే ఆన్‌లైన్ చేసి పేమెంట్ త్వరగా వచ్చేలా చేయాలని అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పేమెంట్ చెల్లింపుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్‌లైన్ చేయడం, రైతుల పేమెంట్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.