వరంగల్ పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ తక్షణమే అందుబాటులో కి రావాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాహనాల ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ లతో జరిగిన సమావేశంలో పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు. సానిటేషన్ సంబంధిత వాహనాలు మరమ్మతుల కోసం వస్తే వెంటనే రిపేర్లు పూర్తి చేయించాలన్నారు.