హనుమకొండ నగరంలో శనివారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్తు మరమ్మత్తు, మెయింటెనెన్స్ కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయముంటుందని శుక్రవారం హనుమకొండ డీఈ సాంబరెడ్డి తెలిపారు. మడికొండ టెక్స్టైల్ పార్క్, టేకులగూడెం, బాపూజీ నగర్, హంటర్ రోడ్, హనుమకొండ చౌరస్తా, బస్టాండ్, గోపాల్ పూర్ తదితర ప్రాంతాలలో కరెంటు ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.