నయింనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని బల్దియా కమీషనర్ డా. అశ్విని తానాజీ వాకడే అన్నారు. బ్రిడ్జి తుది దశ పనులను గురువారం కేత్రస్థాయిలో పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయుటకు తగు సూచనలు చేశారు. ఈ నెల 9వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రిడ్జిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నందున పెండింగ్ లో ఉన్న ఫుర్నిషింగ్ పనులతో పాటు సుందరికరణ పనులను శుక్రవారం పూర్తి చేయాలన్నారు.