వరంగల్ జిల్లా కోర్టులో బుధవారం న్యాయవాదులువిధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ చౌరస్తాలో న్యాయవాది గంధం శివ పై పోలీసుల దాడిని ఖండించారు. ఘటనపై స్పందిస్తూ అత్యవసర సర్వసభ్య సమావేశంను వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్నాయి. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఉమ్మడి జిల్లాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. అకారణంగా న్యాయవాదిపై దాడి చేశారన్నారు.