ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు.