దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్లో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరావగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వం సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు.